MDK: చిన్న శంకరంపేట మండలం సంగాయిపల్లికి చెందిన గర్భిణీ గొల్ల ప్రవళికకు చేగుంట 108 వాహనంలో ప్రసవం జరిగింది. తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే స్పందించిన ఈఎంటి వినోద, వాహనంలోనే సురక్షితంగా సాధారణ ప్రసవం చేశారు. ప్రవళిక మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.