నెల్లూరు బాలాజీ నగర్ కోదండరాముని ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం కోదండ రాముని రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవానికి ఉభయకర్తలుగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సంధ్య దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా వెండి తాపడాల కోసం కోటంరెడ్డి రూ.2 లక్షలు విరాళం అందజేశారు.