WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రతి నెల ఒకటో తేదీన పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు సీతక్క, పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.