AP: దేశ వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పోరాడతామని CM చంద్రబాబు పునరుద్ఘాటించారు. మహిళలకు 33% సీట్లు కేటాయించేందుకు TDP సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, లేకున్నా TDP తరఫున మహిళలకు 33% సీట్లు కేటాయించి తీరుతామని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.