ATP: మహానాడు వేదికగా టీడీపీకి భారీగా విరాళాలు ప్రకటించారు. MLA పరిటాల సునీత రూ.5లక్షలు, పరిటాల శ్రీరామ్ రూ.5లక్షలు విరాళం అందజేశారు. అలాగే గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రూ.5లక్షలు పార్టీకి ప్రకటించారు. విరాళాలు అందజేసిన నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.