NRPT: ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ హెచ్చరించారు. బెట్టింగ్ చట్టరీత్యా నేరమని, దీనివల్ల ఆర్థిక నష్టంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొన్నారు. యువత ఈ వ్యసనానికి బానిస కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు.