MBNR: మిడ్జిల్ మండలం వస్పుల, వల్లభురావుపల్లి గ్రామాల్లో పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో గాలికుంటు (FMD) నివారణ టీకాలు వేశారు. మొత్తం 345 పశువులకు ఉచితంగా టీకాలు అందించారు. మూడు నెలలు నిండిన ప్రతి పశువుకు ఈ టీకా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు పాల్గొన్నారు.