NLG: దేవరకొండలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం “ఇంటింటికి సీపీఐ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విరాళాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాట పార్టీ సీపీఐకి చేయూతనివ్వాలని కోరారు. సీపీఐ 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు.