SS: రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో ‘మహిళా చట్టాలపై’ శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఈఓ లావణ్య, అధ్యక్షురాలు సుశీలమ్మ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వివక్ష, హింస అంశాలపై నాటిక ప్రదర్శించి అవగాహన కల్పించారు. గృహహింస, బాల్య వివాహాలు, సమానత్వం, నిర్ణయాధికారం వంటి అంశాలపై చర్చించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ఉండాలన్నారు.