NRPT: మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులతో తాగునీటి పనులను పూజ చేసి ప్రారంభించినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. వాట్వాట్, కొత్తపల్లి, ఓబులాపూర్, నేరడగం దొడ్డి, వర్కూర్ గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ పనులతో గ్రామాల్లో నీటి ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.