WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఎన్ఐసీజీఎస్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఇమ్మడి ఆంధ్రయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి పాల్గొన్నారు. ప్రజలు ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని, సుఖసంతోషాలతో జీవించాలని సారంగపాణి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చర్చి సభ్యులు పాల్గొన్నారు.