NRPT: ఈ నెల 6న పట్టణంలో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య పిలుపునిచ్చారు. మక్తల్ ఆంజనేయస్వామి ఆలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం నల్లజానమ్మ ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభమై రామ్ లీలా మైదానంలో సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.