AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. దీనికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘ధాన్యం కొనుగోలుకు మొత్తం 1,917 కేంద్రాలు సిద్ధం చేశాం. ధాన్యం తరలించేందుకు 17,200 వాహనాలు ఉపయోగిస్తున్నాం. 1264 రైస్ మిల్లులు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు గోనె సంచులను ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం’ అని పేర్కొన్నారు.