PDPL: జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన యోధుడు అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.