SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ స్టేజి నుంచి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లు గత కొద్ది రోజులుగా అక్కడక్కడ వెలగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, రాత్రి వేళలో చీకటిలో కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, ప్రయాణికులు, నడుచుకుంటూ వెళ్లేవారు వాపోతున్నారు.