సూపర్‌స్టార్ కృష్ణ నిస్వార్థ గుణాన్ని ఆయన మేకప్‌మ్యాన్ మాధవరావు వెల్లడించారు. చిరంజీవి కెరీర్‌ను మార్చిన ‘ఖైదీ’ కథ మొదట కృష్ణ వద్దకే వచ్చిందట. అయితే చిరంజీవి డ్యాన్స్‌లకు ఈ కథ సరిపోతుందని ఆయనే స్వయంగా సూచించారట. అలాగే ‘కటకటాల రుద్రయ్య’ కథను కూడా తనకంటే కృష్ణంరాజు ఆయనైతేనే న్యాయం చేస్తారని వదులుకున్నారని మాధవరావు వెల్లడించారు.