BDK: పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నేత కోరం సురేందర్ పేర్కొన్నారు. బిల్లుడు తండాలో రూ. 5 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శుక్రవారం భూమిపూజ చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కోరం సురేందర్ తెలిపారు.