JN: బచ్చన్నపేట మండల పరిధిలోని కట్కూర్ గ్రామంలో పాస్టర్ పిన్నింటి స్టాన్లీ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. యేసు క్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం సిలువపై ప్రాణ త్యాగం చేసిన రోజును స్మరిస్తూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటల గురించి పాస్టర్ స్టాన్లీ వివరించారు.