MBNR: నవాబ్ పేట్ మండలం కాకర్లపహాడ్ గ్రామాన్ని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూరి గుడిసెల్లో నివసించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం వర్షాకాలం దృష్ట్యా స్థానిక నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.