PBKSతో మ్యాచ్‌లో CSK భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. శాంసన్ (7) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ, ఆయూష్ మాత్రే (67*) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కెప్టెన్ గైక్వాడ్ (28)*తో కలిసి ఆయూష్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో స్కోర్ 110/1. దూబే, సర్ఫరాజ్, కార్తీక్ వంటి హిట్టర్లు ఉండటంతో CSK 200 పరుగుల మార్క్‌ను దాటేలా కనిపిస్తోంది.