PDPL: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీని ఇవాళ ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా ఏఎంసి డైరెక్టర్ కంపల్లి రాజేశం, వైస్ ఛైర్మన్గా సోగాల వంశీ, ప్రధాన కార్యదర్శిగా నారా ప్రేమ్ సాగర్, ప్రచార కార్యదర్శిగా జేరిపోతుల శ్రీకాంత్, కోశాధికారిగా బొల్లి సూర్యచరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.