ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 6 బ్లాక్ స్పాట్లను పోలీసులు తనిఖీ చేశారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎంవీఐ అధికారులు కలిసి ఎన్హెచ్-44, ఎన్హెచ్-67 రోడ్లను సమగ్రంగా పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులపై సమీక్ష నిర్వహించారు.