CBSE కొత్త పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు త్రిభాషా విధానం ప్రవేశపెట్టనుంది. నూతన జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల్లో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు చదివే మూడు భాషల్లో.. రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి. విద్యార్థులకు బహుభాషలపై అవగాహన కల్పించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు.