RR: తుర్కయంజాల్ డివిజన్ లో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.దర్శనం మొగులయ్య పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడుని తెలంగాణ సమాజం ఎన్నడూ మరువదన్నారు.