AP: పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ప్రజావిజయం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ప్రజారాజధానికి దక్కిన గౌరవమని.. ఇందుకు 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున ప్రధాని మోదీ, కేంద్రహోంమత్రి అమిత్ షా, పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందగానే బిల్లు చట్టంగా మారుతుందన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు.