GNTR: పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా దళారులు జోక్యం చేసుకున్నా, అక్రమంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే 9849355955 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.