TG: టెక్స్టైల్ రంగ అభివృద్ధికి తెలంగాణ కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్-2026’లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కులు, క్లస్టర్ల ద్వారా చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.