పార్వతీపురంలో రేపు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను కాపాడుకునే దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ సంకల్పం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.