ATP: జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించాలని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన అరవింద్ గ్రూప్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. CM చంద్రబాబు నేతృత్వంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.