NZB: దేశవ్యాప్తంగా గడ్డి మందును పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ కవితా రెడ్డి కోరారు. శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దీని వల్ల భూమి సారవంతం దెబ్బతినడంతో పాటు రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.