ASR: ప్రజా దర్బార్లో వచ్చిన వినతులపై టీడీపీ అరకు నియోజవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర తక్షణమే స్పందించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దర్బార్లో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. తాగునీరు, రహదారి, పెన్షన్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.