JN: జనగామలోని వివిధ చర్చీల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉండ్రుపుర బాప్తిస్ట్ చర్చిలో మేకల ఏసుపాదం, పాస్టర్ బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు. అలాగే ప్రెస్టన్ స్కూల్ ఎదురుగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చితో పాటు పట్టణంలోని ఇతర ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు.