PLD: చిలకలూరిపేట మండలం రామచంద్రాపురంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.3.58 లక్షలతో చెత్త సంపద కేంద్రం, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు ప్రారంభించారు. ప్రజలు ఇళ్లతో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి చెత్తను పారిశుధ్య వాహనాలకే ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.