VKB: బంట్వారం మండలంలో దొంగల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై విమల సూచించారు. ఇటీవల మండల కేంద్రంలో ఆవులు దొంగతనానికి గురవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పశువుల యజమానులు, గ్రామస్తులు జాగ్రత్తలు వహించాలని సూచించారు.