KRNL: పెద్దకడబూరు మండలానికి నూతనంగా నియమితులైన ఎస్ఐ మారుతిని TDP జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, విధుల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మండలంలో శాంతి భద్రతలు మెరుగుపర్చేందుకు పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని కోరారు.