ATP: అనంతపురం కలెక్టరేట్లో శుక్రవారం బడ్జెట్ 2026-27 అవుట్రీచ్ కార్యక్రమం జరిగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రాస్, జేసీ విష్ణుచరణ్ బడ్జెట్ అంశాలపై చర్చించారు. జిల్లా అధికారులు సమన్వయంతో బడ్జెట్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.