చెన్నైలోని M.A చిదంబరం (చేపాక్) పిచ్ గతంలో స్పిన్నర్లకు అనుకూలించేది. కానీ, ఇటీవల స్టేడియం పునరుద్ధరణ తర్వాత పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తోంది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో 180-190 పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది.