KRNL: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని కర్నూలులో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ నాయకత్వంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.3000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు.