ఖమ్మం: YSR కాలనీ గ్రీన్ హిల్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ రిసెప్షన్ ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. అతిథుల కోసం పకడ్బందీగా భోజన వసతులు, భారీ బందోబస్తు మధ్య ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు.