HNK: మెయింటెనెన్స్ పనుల కారణంగా హన్మకొండ నగరంలో సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుంది. సోమిడి, ఆన్ఇసి, గోపాల్పూర్ ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్ నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరుతూ, అత్యవసర సేవల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.