AP: ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతో వైసీపీ నేతలు కోర్టులకు వెళ్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘తిరుమల లడ్డూ అంశంపై ఎవరూ మాట్లాడకూడదని సుప్రీంకోర్టుకు వెళ్లారు. వివేకా హత్య విషయంలో చెల్లెలు సునీతారెడ్డిని మోసం చేశారు. ఆలయాలు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. హిందూ మతం పాటిస్తా.. ముస్లిం, క్రైస్తవుల సంప్రదాయాలను గౌరవిస్తా’ అని వెల్లడించారు.