AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాజధాని మహిళలు పయనమయ్యారు. పార్లమెంట్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో మొక్కులు తీర్చుకునేందుకు వీరంతా కాలినడకన విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించనున్నారు. రాష్ట్రానికి సంపద సృష్టించే నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలని కోరుకోనున్నట్లు తెలిపారు.