JGL: రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్పంచులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన మొక్కజొన్న విక్రయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించాలన్నారు . స్పందించిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.