KMR: కల్కినగర్లో జూదం ఆడుతున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో జూదమాడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.26,770 నగదు, 9 ఫోన్లు, 6 స్కూటీలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, యువత బాధ్యతగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.