AP: ఇవాళ పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఆయా జిల్లాల్లోని స్పాట్ కేంద్రాల్లో ఉ.9-సా.6 గంటల మధ్య ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు దాదాపు 20 వేల మందిని నియమించారు. కాగా మార్చి 16-ఏప్రిల్ 2 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 3415 సెంటర్లలో పరీక్షలు జరగ్గా.. 622152 మంది రెగ్యులర్ విద్యార్థులు, 19568 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరయ్యారు.