SRCL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య అవగాహన పై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో ఈట్ రైట్ వాకథాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్య, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ కళాశాలల విద్యార్థులతో కలిసి నిర్వహించారు.