హీరోయిన్ జాన్వీ కపూర్ తరచూ తిరుమల శ్రీవారిని కాలినడకన మెట్లెక్కి దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సామాన్య భక్తురాలిలా దేవుడిని దర్శించుకోవడమే తనకు ఇష్టమని పేర్కొంది. కాలినడకన వెళ్లి దర్శించుకోవడం వల్ల కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి చేరువైనట్లు అనిపిస్తుందని తెలిపింది. స్వామివారి దర్శనం చేసుకోవడం ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పింది.