SRD: పటాన్చెరులో నిర్మిస్తున్న నూతన సీఎస్ఆర్ (CSR) దవాఖానకు రూ. 35 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన HIT TVతో మాట్లాడుతూ.. ఈ నిధులతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. జూన్ నుంచి ఆస్పత్రిలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో స్థానికుల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు.