MBNR: గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని జిల్లా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. HYDలోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఈ దాడి నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అరాచకాలను కేసీఆర్ భరించడం ఆయన గొప్పతనమని, ఆయన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.