RR: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం అల్లాదుర్గ సీఐ రేణుక రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఫోటోను సీఐకు అందజేశారు.